ఐసీసీ టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మధ్య జూన్ లో జరగబోయే వరల్డ్ టెస్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీ ఎనౌన్స్ చేసింది. రూ.31.4 కోట్ల రూపాయలను మొత్తం 9 జట్లు పంచుకోనున్నట్టు ప్రకటించింది.
గతంలో నిర్వహించిన టెస్ట్ ఛాంపియన్ షిప్ కి, ఈసారి జరగబోతున్నటోర్నీకి ప్రైజ్‌మనీలో ఎలాంటి మార్పు లేదని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. 2019-21లో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఇచ్చినట్లే ఈ సారి కూడా ఇస్తున్నామని బాంబ్ పేల్చింది.
2021లో జరిగిన ఫైనల్లో ఇండియాపై నెగ్గిన కివీస్ జట్టుకు 13 కోట్ల ప్రైజ్‌మనీ ఇచ్చారు. ఈసారి ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య లండన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.
జూన్ 7వ తేదీన మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన జట్టుకు 13.22 కోట్లు, రన్నరప్ కు 6.61 కోట్లు దక్కనున్నాయి. ఇక డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 3.72 కోట్లు దక్కనున్నాయి.
నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు 2.9 కోట్లు, ఐదో స్థానంలో ఉన్న శ్రీలంకకు 1.65 కోట్లు, న్యూజిలాండ్(6), పాకిస్థాన్(7), వెస్టిండీస్(8), బంగ్లాదేశ్(9) జట్లకు రూ.82 లక్షల చొప్పున అందనున్నాయి.