2021-22 క్రికెట్ సీజన్ ముగిసింది. ఈ క్రమంలో అన్ని ఫార్మాట్లకు సంబంధించి వార్షిక ర్యాంకింగ్స్ ను ఐసీసీ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం.. టెస్టుల్లో 128 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆసీస్ తర్వాత 119 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే భారత్ ఒక పాయింట్ మెరుగు పరుచుకుంది. ఆ తర్వాత స్థానాల్లో న్యూజిలాండ్ (115) , దక్షిణాఫ్రికా(102), పాకిస్తాన్ (93)పాయింట్లతో కొనసాగుతున్నాయి.
వన్డే ర్యాంకింగ్స్ లో కివీస్ జట్టు టాప్ ప్లేస్ లో ఉంది. న్యూజిలాండ్ జట్టుకు మొత్తం 125 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఇంగ్లాండ్ జట్టు (124) ఉంది. గతంతో పోలిస్తే ఇంగ్లాండ్ కు ఐదు పాయింట్లు పెరిగాయి. ఆసీస్ 107 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. భారత్ జట్టు (105) నాల్గవ స్థానంలో ఉంది.
టీ-20ల్లో భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. భారత్ తర్వాత ఇంగ్లాండ్ (265) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పాకిస్తాన్ (261), దక్షిణాఫ్రికా(253), కంగారు జట్టు(251)లు ఉన్నాయి.