2022 లో ఆస్ట్రేలియాలో నిర్వహించబోయే ప్రపంచకప్ టీ-20 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 16న నుండి నవంబర్ 13 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. రెండు గ్రూపులుగా సూపర్-12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూపు-1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆప్ఝనిస్తాన్ లు ఉండగా.. గ్రూపు-2లో భారత్ , పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ లు ఉన్నాయి.
అయితే ఈ షెడ్డ్యూల్ అనే కాదు ప్రతీ షెడ్డ్యూల్ లో 2 కామన్ పాయింట్స్ ను ఉంటాయి.
1) పాకిస్తాన్, ఇండియా ఒక గ్రూప్ లో, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు మరో గ్రూప్ లో
2) పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆదివారం ఉండడం!
ఎన్ని ప్రపంచ కప్ షెడ్డ్యూల్స్ చూసిన పైన చెప్పిన పాయింట్స్ 90శాతం ఫాలో అయ్యింది ICC. దీనికి కారణం TRP రేటింగ్స్, కాసుల కక్కుర్తి.
ఎన్ని క్రికెట్ మ్యాచ్ లు జరిగిన పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ కు ఉన్న క్రేజ్ వేరు దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ రెండు జట్లను ఒక గ్రూప్ లో వేస్తారు. ఈ రెండు జట్ల మద్య మ్యాచ్ ను ఆదివారం నిర్వహిస్తారు.
సేమ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ల జట్ల వైరం కూడా ఎప్పటిదో కాబట్టి ఆ రెండు జట్లను మరో టీమ్ లో వేస్తుంటారు. సింపుల్ లా చెప్పాలంటే ఆట ఎప్పుడో కాసుల వేట గా మారింది.!