వచ్చే నెల 17నుంచి టీ-20 మహాసంగ్రామం మొదలు కానుంది. భారత్ ఆధ్వర్యంలో యూఏఈ, ఒమన్ వేదికగా 16 జట్లు ఇందులో పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో లైవ్ ది గేమ్.. లవ్ ది గేమ్ పేరుతో ఓ థీమ్ వీడియోను వదిలింది ఐసీసీ. ప్రపంచమంతా టీ-20 వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా చూపించారు.
వీడియోలో నాలుగు టీమ్స్ కు చెందిన నలుగురు ఆటగాళ్లను మాత్రమే చూపించారు. టీమిండియా సారథి కోహ్లీ, ఆఫ్ఘాన్ ఆటగాడు రషీద్, ఆసీస్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్, విండీస్ కెప్టెన్ పొలార్డ్ కు చెందిన అవతార్ యానిమేషన్లు కనిపించాయి.
అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ఈ వీడియోలో టీ-20 ప్రపంచ కప్ లో పాల్గొనే జట్ల జెర్సీలు, జాతీయ జెండాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.