ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నా దోశకున్న ప్రాధాన్యత వేరు. దోశకు దోస్త్ కాని వాళ్ళు చాలా అరుదు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఆ రోజు అన్నం తినాలని లేకపోతే ఆ పూటని పస్తుపెట్టకుండా ఓ దోశతో సరిపెడతారు. ఆకలి తీరడానికిది మినిమమ్ గ్యారెంటీ మీల్ అనడంలో ఏ సందేహమూ లేదు.
పొట్టనింపుకోవడానికే కాదు, పొట్టపోషించుకోడానికి కూడా దోశ ఓ మంచి ఆదాయ మార్గం. దోశలనే జీవనాధారంగా చేసుకుని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. అయితే దోశల్లో ఎన్నోరకాలున్నాయి.
ఉల్లిదోశ, కారం దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, రవ్వదోశ, 70ఎమ్ఎమ్ దోశ, ఎమ్మెల్యే దోశ,ఎంపీ దోశ, చిరంజీవిదోశ, సెట్ దోశ, ఘీదోశ..లాంటి అష్టాశత దోశనామావళి ఉంది. వాటి గురించి విన్నాం…చాలా వరకూ తిన్నాం.
అయితే ఐస్ క్రీమ్ దోశ ఎప్పుడైనా తిన్నారా.!? కనీసం విన్నారా..!? ఐస్ క్రీమ్ దోశేంటని షాకయ్యారు కదూ.! ఓ స్ట్రీట్ ఫుడ్ దోశమాస్టర్ ఈ దోశకు శ్రీకారం చుట్టాడు. ఐస్‌క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్ సృష్టించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వెరైటీ, విచిత్రమైన దోశపై మీరూ ఓ లుక్కేయండి
South Indian dish dosa ko Gujarat me survive karne k liye icecream se dosti karna pad ja raha hai 😭😭😹 pic.twitter.com/Pq2UBuHriE
— Byomkesh (@byomkesbakshy) January 28, 2023