ICICI బ్యాంకు మాజీ ఎండీ చందా కొచ్చర్‌కు బెయిల్ దొరికింది. నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్‌నకు 2009-12 మధ్య కాలంలో రూ. రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేశారని, ప్రతి ఫలంగా ఆమె లబ్ది పొందారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. తన భర్త నడిపిస్తున్న కంపెనీలో ఆతర్వాత వీడియోకాన్ పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. ఈ ఇష్యూపై 2019లో సీబీఐ, 2020లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేశాయి. భార్యాభరలిద్దరిపైనా మనీలాండరింగ్ అభియోగాలు దాఖలయ్యాయి.
గత నెల 30న చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్, వీడియోకాన్ ప్రొమోటర్‌తో పాటు పలువురికి ముంబై పీఎంఎల్‌ఏ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో బెయిల్ కోసం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంలో బెయిల్ మంజూరుకు ఈడీ ఒకే చెప్పడంతో.. రూ.5 లక్షల పూచికత్తుతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ సమయంలో అనుమతి లేకుండా దేశం విడిచిపోవద్దని ఆదేశించింది.