ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఫిన్ టెక్ విభాగంలోకి అడుగు పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేకు పోటీగా ఐ మొబైల్ పే పేరుతో కొత్త పేమెంట్ యాప్ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే కాకుండా.. ఇతర బ్యాంక్ కస్టమర్లకూ పేమెంట్స్, బ్యాంకింగ్ సేవలందించనుంది..
ఈ యాప్ ద్వారా వినియోగదారులు యూపీఐ ఆధారిత పేమెంట్లు, బిల్ పేమెంట్స్ అయిన రీఛార్జ్, కరెంట్ బిల్, ఇతర సర్వీసులను చేసేందుకు వీలు కల్పించింది. పెట్టుబడులు, క్రెడిట్ కార్డ్, గిఫ్ట్ కార్డ్, ట్రావెల్ కార్డ్ వంటి సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.