HCQ మందుల‌పై ICMR, WHO వింత వాద‌న‌లు - Tolivelugu

HCQ మందుల‌పై ICMR, WHO వింత వాద‌న‌లు

క‌రోనా వైర‌స్ సోకిన బాధితుల‌కు చికిత్స‌లో ప్ర‌పంచం అంతా మ‌లేరియా మందు హైడ్రాక్సి క్లోరోక్విన్ ను ఉప‌యోగిస్తోంది. అమెరికా అయితే ఇండియాను బ‌హిరంగంగానే బెదిరించి మ‌రీ హెచ్సీక్యూ మందుల‌ను తీసుకెళ్ల‌గా… భార‌త్ కూడా అడిగిన వారంద‌రికీ మందుల‌ను ఎగుమ‌తి చేసింది.

ఇక భార‌త మెడిక‌ల్ రిసెర్చి సంస్థ ఐసీఎంఆర్ క‌రోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ తో పాటు క‌రోనా పేషెంట్ల‌కు హెచ్సీక్యూ మందుల‌ను ఉప‌యోగించాల‌ని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఐసీఎంఆర్ తాజా మార్గద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన మరుస‌టి రోజే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సంచ‌ల‌న కామెంట్ చేసింది. హెచ్సీక్యూ మందుల‌తో క‌రోనా క‌ట్ట‌డి అవుతుందన్న‌ది ఇంకా ప‌రిశోధ‌న‌లో తేల‌లేదు. నివార‌ణ‌కు వాడుతున్న‌ప్ప‌టికీ అది శ‌క్తివంతంగా పనిచేస్తుంద‌న్న దాఖ‌లాలు లేవ‌ని వ్యాఖ్యానించింది. అంతేకాదు హెచ్సీక్యూ వాడుతున్న బాధితుల్లో మ‌ర‌ణాల శాతం ఎక్కువ‌గా ఉంద‌ని ప‌లు అంత‌ర్జాతీయ క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో పాటు ప్ర‌పంచంలోని రీసెర్చీ సంస్థ‌ల వ్యాఖ్య‌ల‌తో… ఐసీఎంఆర్ త‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను నిలుపుద‌ల చేస్తుందా…? భార‌త్ లో ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా హెచ్సీక్యూ మందులు ప‌నిచేస్తున్నాయ‌నే అంశానికే క‌ట్టుబ‌డి ఉంటుందో చూడాలి.

Share on facebook
Share on twitter
Share on whatsapp