ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో బూస్టర్ డోస్ పై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ డోస్ వేసుకున్న 9 నెలల తర్వాతే బూస్టర్ డోస్ వేసుకోవాలని ఐసీఎంఆర్ పార్లమెంటరీ కమిటీ తెలిపింది. అయితే, బూస్టర్ డోస్ కోసం కోవిషీల్డ్ వ్యాక్సిన్ మంచిదని తమ పరిశోధనలో తేలినట్టు ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ చెప్పారు.
కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటివరకూ 32 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. దీంతో, ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.