ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో కరోనా టెస్టులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది ఎంతో ప్రమాదకరం అని విమర్శలు వస్తున్న తరుణంలో… దేశీయ వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ శుభవార్త ప్రకటించింది. దేశంలో మరో 7 లక్షల ర్యాపిడ్ కరోనా టెస్ట్ కిట్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది.
ఇండియాలో కొన్ని కేంద్రాలుగా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. అక్కడి నుండే కరోనా వైరస్ విజృంభిస్తున్నందున… ఆ హాట్ స్పాట్ జోన్స్ లో ముందుగా ఈ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది.
ఏప్రిల్ 8వ తారీఖు నుండి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. మొదటి దశలో 5 లక్షలు, ఆ తర్వాత 2 లక్షలు వస్తాయని, ఆ తర్వాత అవసరం మేరకు మరిన్ని తెప్పిస్తామని ఐసీఎంఆర్ ప్రకటించింది.
దేశంలో 11 రాష్ట్రాల్లో ఈ హాట్ స్పాట్ కేంద్రాలున్నట్లు కేంద్రం ప్రకటించింది.