కరోనా వైరస్ కు చికిత్స పేరుతో విచ్చలవిడిగా ఎన్నో రకాల మందులు వాడాం. వైద్యంలో పేరు మోసిన డాక్టర్లు సైతం కొన్ని మందులను ఐసీఎంఆర్, అమెరికా ఎఫ్డీఏ సూచన మేరకు రెకమండ్ చేశారు. కానీ తీరా సమయం గడుస్తున్నా కొద్దీ మందుల ప్రభావం ఎంతో తెలిసిపోతుంది.
తాజాగా ఐసీఎంఆర్ జారీ చేసిన సూచనల ప్రకారం కోవిడ్ చికిత్సలో ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను వాడరాదని తెలిపింది. ఈ మందులు కరోనాపై ప్రభావం చూపినట్లు డేటా లేదని, ఈ మందులు వాడితే వైరల్ తగ్గినట్లు కానీ లక్షణాలు తగ్గినట్లు కానీ తేలలేదని ఏయిమ్స్ వైద్యుల పరిశీలనలో తేలింది. హైడ్రాక్సీక్లొరోక్వీన్ తో మరణాలు తగ్గలేదని తెలిపారు. పైగా ఈ మందును అజిత్రోమైసిన్ తో కలిపి వాడితే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు తేల్చారు.
ఐవర్ మెక్టిన్ వాడకంపై గతంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు హెచ్చరికలు జారీ చేసింది.