కరోనా వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణం కనపడటం ఒకవైపు, వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ శ్రమిస్తున్న నేపథ్యంలో… భారత పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ కూడా కరోనా వ్యాక్సిన్, డ్రగ్ కోసం చెమటోడ్చుతుంది. గతంలో మలెరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలను నయం చేయటంలో ప్రపంచ దేశాల కన్నా కూడా భారత ఐసీఎంఆర్ మంచి మెరుగైన ప్రతిభ కనపర్చింది.
మొన్నటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ పై చేసే పరిశోధనల్లో భారత్ భాగస్వామిగా లేదు. కానీ భారత్ లోనూ ఈ వైరస్ జలుం విధిల్చుతున్న నేపథ్యంలో… ఇక డబ్లూ హెచ్ వోతో కలిసి పనిచేయాలని ఐసీఎంఆర్ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు వ్యాక్సిన్ కోసం ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఇప్పటికే రంగంలోకి దిగారని, ప్రస్తుతం 5 రకాల జంతువులపై పరీక్షలు కొనసాగుతున్నాయని, మనుషులపై ప్రయోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ కనుగొనేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు.