హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఎంత అట్టహాసంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నుల పండుగ అనే చెప్పాలి. వారు వీరు అనే తేడా లేకుండా సాధారణ జనంతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ నిమజ్జనంలో పాల్గొంటూంటారు. అంతేకాకుండా హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుంటారు. లేటెస్ట్ గా ఈ గణేష్ నిమజ్జనంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. తన కూతురు అర్హతో కలిసి సందడి చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కూతురు అర్హతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న జూబ్లిహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ భవనంలో నెలకొల్పిన గణషునికి నేడు విడ్కోలు పలికారు. ఈ నిమజ్జనంలో బన్నీ తన కూతురు ఆర్హతో కలిసి పాల్గొన్నారు.
ఈ వేడుకలో గణపతికి వీడ్కోలు చెబుతూ బన్నీ కొబ్బరి కాయ కొట్టగా.. అర్హ గణపతి బప్పా మోరియా అంటూ సందడి చేసింది. కూతురిని ఎత్తుకుని మురిసిపోతూ బన్నీ డాన్స్ చేసిన ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు అల్లు ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో బన్నీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్కులో కనిపించి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ పుష్ప ది రూల్ రాబోతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.