ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్కెట్ పాన్ ఇండియా లెవల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఎన్నో హిట్ సినిమాల్లో దేశముదురుకి ఉన్న క్రేజ్ వేరు.
అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ చిత్రం రీ రిలీజ్ ఉంది అనే మాట గట్టిగా వినిపించింది. రీసెంట్ గా ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ లు గట్టిగా ఊపందుకున్నాయి. మరి ఈ ట్రెండ్ లో అయితే అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రం రీ రిలీజ్ కి ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ చిత్రం ఏప్రిల్ 7 న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారట. మరి ఈ రెండు రోజుల్లోనే బన్నీ బర్త్ డే ఉండడంతో అభిమానులు ఈ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. దీనిపై కూడా భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా అయితే ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించగా హన్సిక హీరోయిన్ గా నటించింది. అలాగే చక్రి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.