ఐడా తుపాను అమెరికాను వణికిస్తోంది. లూసియానా వైపు దూసుకొచ్చిన ఈ తుపాను తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. ఇప్పటిదాకా యూఎస్ తీరాన్ని తాకిన శక్తివంతమైన హరికేన్లలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు వాతావారణశాఖ అధికారులు. లూసియానా తీరంలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అయితే ఈ తుపానుకు సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది.
ఐడా హరికేన్ తీవ్రతను తెలుసుకునేందుకు ఇద్దరు పైలట్లు పెద్ద సాహసమే చేశారు. తుపానుకు చాలా దగ్గరగా వెళ్లి వీడియో తీశారు. నేషనల్ హరికేన్ సెంటర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అదికాస్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తక్కువ పీడనం కారణంగా పైలట్లు కూర్చున్న సీట్లు కూడా ఊగాయి. అయినా కూడా తుపాను ఫోటోలు, వీడియోను కెమెరాలో బంధించారు. నిమిషం పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.