నలుగురు బైక్ రైడర్లు వారి గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో జరిగే కొన్ని పరిచయాలు…వారి మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా తెరెక్కుతున్న చిత్రం ఇదే మా కథ. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్, టీజర్‌ను ఇటీవల విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేశారు.
ఆ టీజర్‌కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కాగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను గాంధీ జయంతి అక్టోబర్ 2న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.