ఆధ్యాత్మికవేత్త, ధార్మిక సంస్క ర్త రామానుజాచార్యులు అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. సాంఘిక విప్లవాన్ని సమాజానికి అందించిన మహనీయులు రామానుజాచార్యులు అని కొనియాడారు. ఆయన సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి అని పేర్కొన్నారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు రామానుజాచార్యులు అని కొనియాడారు. సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ముచ్చింతల్ లో చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ లో రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్దిఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతామన్నారు.
కొవిడ్ ప్రభావం తగ్గించేందుకు యజ్ఞం చేస్తున్నామని తెలిపారు. మనిషిలోని అంతర్గత వైరస్ తొలగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు.