మెగాస్టార్ చిరంజీవి అనగానే ఫాన్స్ లో పూనకం వస్తుంది. మాస్ ఆడియన్స్ కి ఆయన బాగా దగ్గరయ్యారు అనే చెప్పాలి. ఇప్పుడు అంటే చిరంజీవి క్రేజ్ కాస్త తగ్గింది గాని ఒకప్పుడు ఆయన సినిమా వస్తే చాలు జనాలకు పూనకం వచ్చేది. ముఖ్యంగా కార్మికులు, వ్యవసాయ కూలీల్లో చిరంజీవి సినిమా అంటే ఒక రేంజ్ లో ఆదరణ ఉండేది. ఎన్టీఆర్, కృష్ణ తర్వాత మాస్ ఆడియన్స్ ను ఆ రేంజ్ లో సంపాదించిన హీరో చిరంజీవి.
ఇక చిరంజీవి మాస్ సినిమాలు చేస్తే అవి కచ్చితంగా హిట్ కొడతాయి అనే భావన ఫాన్స్ లో కూడా ఉంటుంది. అగ్ర దర్శకుల నుంచి చిన్న దర్శకుల వరకు ఆయన కోసం మాస్ కథలు రాసిన వారే. అయితే ఆయనకు క్లాస్ కథలు పెద్దగా కలిసి రాలేదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆయన క్లాస్ గా కనపడిన సినిమాలు దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. రుద్రవీణ సినిమా కథ ఒక రేంజ్ లో ఉంటుంది.
ఆ సినిమా అనుకున్న విధంగా ఆడలేదు. కారణం అప్పటి వరకు ఫాన్స్ చిరంజీవిని మాస్ హీరోగా చూసి ఆదరించారు. దీనితో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆపద్బాంధవుడు అనే సినిమా చేసారు. ఆ సినిమా కథ బాగుంటుంది గాని సినిమా పెద్దగా ఆడలేదు. సినిమాలో చాలా సీన్ లు బాగుంటాయి. ఇటీవల వచ్చిన గాడ్ ఫాథర్ సినిమాలో కూడా చిరంజీవి క్లాస్ గా కనిపించారు కాస్త. ఆ సినిమా కూడా ఆడలేదు.