ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలకు సంబంధించి కాస్త గట్టి చర్చ జరుగుతుంది. ఏపీ సర్కార్ టికెట్ ధరలకు సంబంధించి సీరియస్ గా ఉండటంతో సినిమా పెద్దలు తమ తమ సినిమాలను విడుదల చేయాలన్నా సరే ఆలోచించే పరిస్థితి వచ్చిందనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలకు సంబంధించి త్వరలో ఒక సమావేశం కూడా నిర్వహించే అవకాశం కనపడుతుంది.
Also Read:బీజేపీ ఆఫీస్ దగ్గర టెన్షన్ టెన్షన్
ఇదిలా ఉంటే టికెట్ ధరలకు సంబంధించి ఒక చరిత్ర తెలుసుకోవాలి. ఎన్టీఆర్ సిఎం గా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో సినిమా హాల్స్ చాలా తక్కువగా ఉండేవి. దీనితో ఒక టికెట్ మీద పది మంది వరకు పంపించే వారు. ధర కూడా ఎక్కువగా ఉండటంతో సామాన్యులు సినిమాలు చూడాలంటె ఇబ్బంది పడే వారు. దీనితో ఎన్టీఆర్ ఈ విధానానికి స్వస్తి పలికి స్లాబ్ సిస్టం పెట్టారు. ఇక టికెట్ ధరలు తగ్గించాలనే ఆదేశాలు కూడా జారీ చేసారు.
దీనితో సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక వర్గం ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ఇందులో దాసరి నారాయణ చాలా కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్ళిన వెంటనే దాసరి ని పిలిచి ఏంటి దాసరి గారు సమస్య అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎన్టీఆర్ కు తమ గోడు వినిపించారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్… నాకు రాష్ట్రంలో ఆరు హాల్స్ ఉన్నాయి… నాకంటే నష్టపోయే వారు ఎవరైనా ఉంటే తీసుకురండి అని దాసరిని అక్కడి నుంచి పంపించారు. అలా ఎన్టీఆర్ పెట్టిన స్లాబ్ పద్దతిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం అయిన తర్వాత తొలగించారు. టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఎన్టీఆర్ సన్నిహితుల సినిమా హాల్స్ లో ఎక్కువ ధరకే టికెట్ అమ్మినా సరే పిలిచి వార్నింగ్ ఇచ్చి తగ్గించారు.
Also Read: మోడీకి తులసిరెడ్డి కౌంటర్