కొందరు దర్శకులకు టాలెంట్ ఉన్నా సరే పరిస్థితి కలిసి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా ఇబ్బందులు పడి కెరీర్ నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎటు కాకుండా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దర్శకుడే ప్రేయసి రావే సినిమా చేసిన చంద్ర మహేష్. ఈయనకు అవకాశాలు మొదట్లో చాలా బాగా వచ్చాయి. కాని అద్రుష్టం మాత్రం కొన్ని విధాలుగా అడ్డం పడి ఎటూ కాకుండా ఆగిపోయారు.
అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. ప్రేయసి రావే సినిమా చేసిన తర్వాత ఆయనకు మంచి ఇమేజ్ వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన్ను పిలిచారు. అలా చిరంజీవి కూడా చంద్ర మహేష్ ను పిలిచి ఒక కథ రెడీ చేయమని చెప్పారు. అదే కథ రెడీ చేస్తున్న సమయంలో సురేష్ బాబు పిలిచారు. ఒక కథ రెడీ చేస్తే వెంకటేష్ తో సినిమా చేద్దామని ఆయన చెప్పారట.
ఇక చిరంజీవికి అసలు విషయం చెప్పి… అంటే తనకు మొదట అవకాశం ఇచ్చింది సురేష్ బాబు కాబట్టి తాను నో అనలేను అని మీతో కొంత సమయం తర్వాత చేస్తాను అని రిక్వస్ట్ చేసారట. తీరా వెంకటేష్ దగ్గరకు వెళ్లేసరికి ఆయన ఎన్ శంకర్ తో జయం మనదేరా సినిమా చేస్తున్నారు. వెంకటేష్… బాబు తో సినిమా చేస్తే బయట సంస్థ తో మరొక సినిమా చేస్తే గాని మళ్లి తిరిగి సురేష్ ప్రొడక్షన్స్ లో చేసే అవకాశం ఉండదు. మళ్ళీ రెండేళ్ళు ఆగాలి. దీనితో చంద్ర మహేష్ కు ఏం చేయాలో అర్ధం కాక శ్రీహరి దగ్గరకి వెళ్లి సినిమాలు చేసారు. వరుసగా మూడు సినిమాలు చేసారు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ లో ముందు అడుగు వేయలేదు.