బీఆర్ఎస్ మహబూబ్ బాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఓ రోగ్ అని అన్నారు. నేను సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పై ఇష్టం వచ్చినట్లు రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు.
నేను సైగ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని..మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదని అన్నారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నాడు రేవంత్ నా గురించి ఏం మాట్లాడుతావ్.. అంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మండిపడ్డారు. ఎర్రబెల్లి ఎదురు లేని నాయకుడు ఆయన్ని విమర్శిస్తావా.. అంటూ ప్రశ్నించారు.
అయితే రేవంత్ రెడ్డి..రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా.. అంటూ ప్రశ్నించారు. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారని తెలిపారు. ఆయన మంత్రిత్వ శాఖ పేరును తప్పులు లేకుండా రాయడం కూడా రాదు ఎర్రబెల్లికి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ ఎక్స్ పర్ట్ అంటూ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ల మీద పడ్డ వ్యక్తి కేసీఆర్ అంటూ మాట్లాడారు. తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కేసీఆర్ కూర్చోబెట్టారు అన్నారు. 90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని తీవ్రంగా ఆరోపించారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు.. 60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలను కేసీఆర్ తాగుబోతులను చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి.