టీమిండియా మంచి ఊపు మీద ఉంది. ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్‌లోనూ భారత్ అదే ఆట తీరు ప్రదర్శించింది. దీంతో మరో వన్డే మిగిలి వుండగానే 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను ఎగురేసుకు పోయింది.
వరుస సిరీస్‌ల విజయాలతో టీమిండియా ర్యాంకింగ్ మెరుగు పడుతోంది. తాజాగా వన్డేల్లో అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో భారత జట్టు ఉంది. రాయ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ జట్టు పాయింట్ల సంఖ్య 113కు చేరింది. దీంతో వన్డే ర్యాంకిగ్స్‌లో న్యూజిలాండ్ తో కలిసి భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఇక వన్డేలో 113 పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వన్డేల్లో ఆస్ట్రేలియా 114 పాయింట్లతో నాలుగో స్థానంలో వుంది. పాకిస్థాన్ 106 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24 న ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే చివరి వన్డేలో భారత జట్టు విజయం సాధిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని చేరుకుంటుంది.