తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు.
డోమ్ లను కూల్చేస్తామన్నారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ఉట్టిపడేలా మార్పులు చేస్తామని బండి వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ తాజ్ మహల్ లెక్క కనిపిస్తుందని అన్నారు. ఒవైసీ కోసం డూమ్ లు కడితే ఊరుకోమని హెచ్చరించారు.
అసద్దుదీన్ కళ్లల్లో ఆనందం కోసమే కొత్త సచివాలయాన్ని తాజ్ మహల్ లాగా కడుతున్నారన్నారు. ఇక ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా మారుస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా మోడీ, బీజేపీని తిడుతున్నారన్నారు.
మేము ఇచ్చిన నిధులపై ఢిల్లీలో లేదా గోల్కొండ లో చర్చించడానికి సిద్దమన్నారు. మోడీ అసెంబ్లీలో లేనప్పుడు ఆయన పేరు ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. తమ పార్టీకి ఓట్లు వేస్తే పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత మాదన్నారు. ఉచిత విద్య అందిస్తాం.. ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు.