టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ హీరోతో సినిమా చేస్తున్నా సరే ఒక రేంజ్ లో సినిమాపై అంచనాలు ఉంటాయి. చిన్న హీరోతో చేసినా దాని గురించి హాట్ టాపిక్ గానే ఉంటుంది మేటర్. అలాంటిది మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే ముందు ఈ సినిమా ప్లాన్ చేసాడు మహేష్.
సినిమాకు భారీ సెట్ వేసి షూటింగ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంచితే ఈ సినిమాపై మహేష్ చాలా ఆశలు పెట్టుకోగా… ఒక సెంటిమెంట్ మహేష్ ని కాస్త తోన్దరపెడుతుంది అని చెప్పాలి. ఏంటి ఆ సెంటిమెంట్ అనేది చూద్దాం. మహేష్ బాబు… గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన అర్జున్ సినిమా ఆగస్ట్ లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో మహేష్ ఇమేజ్ మారిపోయింది.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమా కూడా ఆగస్ట్ లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా మహేష్ లో కొత్త కోణం చూపించింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సినిమా కూడా ఆగస్ట్ లో విడుదలైంది. మహేష్ బాబుకి మొదటి వంద కోట్ల సినిమా ఇదే కావడం విశేషం. దీనితో ఆగస్ట్ లో సినిమా విడుదల కోసం మహేష్ బాబు ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.