అప్పట్లో మహానటి సావిత్రికి ఎంత ఇమేజ్ ఉండేదో భానుమతికి కూడా అంతే ఇమేజ్ ఉండేది. ఆమెతో సినిమా చేయడం అంటే సాధారణ విషయం కాదు అని అంటూ ఉంటారు ఇప్పటికీ. ఆమె సినిమాల్లో ఎలాంటి పాత్ర చేసినా సరే జనాల నుంచి మంచి ఆదరణ ఉండేది. ఇక రోమాన్స్ విషయంలో ఆమె మాత్రం జాగ్రత్తగా ఉండేవారు. ఏ హీరో అయినా సరే కనీసం తన చేతిని కూడా పట్టుకోనిచ్చే వారు కాదు.
ఇక అక్కినేనితో ఆమెకు బాగా గ్యాప్ ఉండేది అని ఎన్టీఆర్ కు బాగా దగ్గరగా ఉండేవారు అని అంటారు. ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాల్లో భానుమతి కనిపించేవారు. బాలకృష్ణ చేసిన మంగమ్మ గారి మనవడు సినిమాలో కూడా మంగమ్మగా ఆమె నటించారు. ఎన్టీఆర్ కుటుంబానికి ఆమె కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉంచితే ఎన్టీఆర్ పార్టీలోకి కూడా ఆమెను ఆహ్వానించారు.
భానుమతి గారు మీరు మా పార్టీలోకి రండి.. పార్టీలో మీకు ప్రాధాన్యం ఇస్తాం అని అడిగారట. అలాగే మీరు మాతో ఉంటే.. తెలుగు వారికి మేలు జరుగుతుందని… మీరు మాకు దన్నుగా ఉండండని కోరారట. అలాగే మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాం అనే ఆఫర్ కూడా ఇచ్చారట ఎన్టీఆర్. తెలుగు వారి సమస్యలపై అక్కడ ప్రధానంగా ప్రస్తావించండి అని అంటే… ఆమె మాత్రం ఏంటి రామారావు గారు తిట్లు తినమంటారా అని ఆఫర్ రిజెక్ట్ చేసారట.