హైదరాబాద్‌లో ఐకానిక్ వంతెన కేబుల్ బ్రిడ్జి గురించి తెలిసిందే. దుర్గం చెరువు వద్ద ఈ వంతెనను నిర్మించారు. తీగల వంతెనగా పిలిచే ఈ బ్రిడ్జిని చూసేందుకు నగర వాసులు భారీగా తరలివస్తుంటారు. వీకెండ్‌లో అయితే రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చూసేందుకు శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది.
బ్రిడ్జి పైనుంచి చాలామంది ఫ్రెండ్స్‌తో కలిసి సెల్పీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు హైదరాబాద్‌లో సెల్ఫీ స్పాట్‌గా కేబుల్ బ్రిడ్జి బాగా పాపులర్ అయ్యింది. ఈ బ్రిడ్జిపై వెళుతుంటే ఆ ఫీలింగే వేరు. చాలామంది ఈ బ్రిడ్జ్ పై బైకులపై వెళ్తూ… సెల్ఫీలు… వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.
అయితే కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా… అక్కడ సెక్యూరిటీని కట్టు దిట్టం చేశారు పోలీసులు. ఇప్పుడు రూల్స్ ఫైన్స్ మరింత కఠినతరం చేశారు. బావుంది కదా… అని బ్రిడ్జిపై వెళ్తూ వెళ్తూ ఆగారా.. మీ పర్సు ఖాళీ అయినట్లే. ఇటీవల కాలంలో బ్రిడ్జిపై కార్లు, బైక్స్ ఆపి ఫొటోలు దిగుతున్నారు. దీని వల్ల ట్రాఫిక్ జాం అవుతుంది. దీన్ని గుర్తించిన సిటీ పోలీసులు.. ఫైన్స్ వేయటం మొదలుపెట్టారు.
ఎవరైనా బ్రిడ్జ్ పై బండి లేదా కారు ఆపినా.. పార్క్ చేసినా భారీగా ఫైన్ వేస్తున్నారు. ఇలా విధించే జరిమానా రూ. 200 రూపాయల నుంచి గరిష్టంగా రూ. 2 వేల వరకు విధించనున్నారు. ఆ డబ్బులు కూడా అక్కడికక్కడి వాహనదారుల నుంచి వసూలు చేయనున్నారు. డబ్బులు లేవంటే చలానా పంపిస్తున్నారు.
పగలు మాత్రమే కాదు.. ట్రాఫిక్ అస్సలు లేదు కదా అని అర్థరాత్రి పార్క్ చేసిన ఇవే రూల్స్ వర్తించనున్నాయి. 24 గంటలూ ఇవే నిబంధనలు అమలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల్ని హెచ్చరిస్తున్నారు. ఇక రాత్రి పూట ఎవరు ఉంటారులే అని లైట్ తీసుకోవద్దు.. బ్రిడ్జిపై నైట్ విజన్ సీసీ కెమెరాలను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.
ఆటోమేటిక్ గా కెమెరాల్లో చూసి ఫైన్స్ వచ్చేస్తాయి. అర్థరాత్రులు బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు, సెలబ్రేషన్లు కేబుల్ బ్రిడ్జ్ చూడటానికి వచ్చిన వాళ్లంతా బ్రిడ్జ్ పైనే పార్కింగ్ చేస్తున్నారు. ఆ సమస్యను నివారించేందుకు ట్రాఫిక్ పోలీస్ ఎన్ని సార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది. దీంతో భారీగా ఫైన్లు వేయాలని పోలీసులు సిద్ధమయ్యారు. ఇక నుంచి కేబుల్ బ్రిడ్జ్ పై బండి ఆగితే.. మీకు ఫైన్ పక్కా.