మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశాడు. అయితే అందులో శంకర్ దాదా ఎంబిబిఎస్ ఒకటి. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. అయితే నిజానికి చాలావరకు సినిమాలలో ఒకరి కోసం అనుకున్న పాత్రలో మరొకరు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా వేరొకరి చేయాల్సిన పాత్రలోనే చేశాడట.
మొదట శ్రీకాంత్ నటించిన ఏటీఎం పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట. కానీ పవన్ అప్పటికే వరుస సినిమాలను చేస్తున్న సందర్భంగా డేట్స్ కుదరక నో చెప్పాడట. దీంతో ఎవరితో చేయించాలనే ఆలోచన ఉన్న సమయంలో శ్రీకాంత్ చిరంజీవి ఇంటికి వెళ్లారట. అప్పుడు చిరంజీవి ఈ పాత్ర నువ్వు చేస్తావా అని అడిగాడట.
పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్
ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది అని చెబుతూనే ఒప్పుకున్నాడట శ్రీకాంత్. ఈ విషయాన్ని శ్రీకాంత్ స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే ఏటీఎం గా శ్రీకాంత్ క్యారెక్టర్ సినిమాకు ఎంత హైలెట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు శ్రీకాంత్. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు.