ఈ సృష్టిలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అలాంటి ఒక విషయమే నత్త మీద ఉప్పు పోస్తే అది మరణించడం. అవును ఈ విషయం చాలా మందికి తెలియదు. నత్త మీద ఉప్పు వేస్తే అది కచ్చితంగా చచ్చిపోతుంది. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. నత్తపై ఉప్పు పోసినప్పుడు ఓస్మోసిస్ అనే ప్రక్రియ ద్వారా నీరు చాలా వేగంగా నత్త శరీర కణాల నుండి బయటకు వచ్చేస్తుంది.
Also Read:రెండు గంటల్లో 20 ప్రశ్నలు.. తొలి రోజు సోనియాను ఈడీ విచారణ
నత్త శరీరం నుంచి నీళ్ళు బయటకు వస్తుంటే అంటే అది ఎండిపోతుంటే గనుక తనను తాను రక్షించుకోవడానికి గాను ఒక సన్నని పదార్థాన్ని నత్త ఉత్పత్తి చేస్తుంది. బురద లాంటి ద్రవంతో పాటుగా గాలి నత్త శరీరం నుండి బలవంతంగా బయటకు వస్తాయి. నత్తపై ఎక్కువ ఉప్పు పోస్తే అది డీహైడ్రేషన్ వల్ల చాలా త్వరగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మనిషి శరీరంలో 55–60% నీరు ఉంటుంది.
అందులో సగం శాతం 2 నిమిషాల్లో కోల్పోతే గనుక కచ్చితంగా డిహైడ్రేషన్ కి గురి అవుతాం. నత్త విషయంలో కూడా అదే జరుగుతుంది. మరి నత్తలు సముద్రంలో కూడా ఉంటాయి కదా అనే వాళ్ళు ఉన్నారు. సముద్రపు నత్తలు శరీర ద్రవాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. అవి నివసించే సముద్రపు నీటితో సమానమైన లవణీయతతో ఉంటాయి కాబట్టి వాటికి ఏం కాదు. సముద్రపు నత్తలను మంచి నీళ్ళలో పెడితే అవి కచ్చితంగా చచ్చిపోతాయి.
Also Read:ఉక్కు బ్రిడ్జికి పట్టీలెందుకు?