గత ఏడాది వచ్చిన సినిమాల్లో టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమా పుష్ప ముందు వరుసలో ఉంటుంది. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అగ్ర హీరో స్థానాన్ని మరింత బలపరిచింది అనే చెప్పాలి. రెండో పార్ట్ వచ్చే ఏడాది వస్తున్న నేపధ్యంలో అల్లు అర్జున్ ఫాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫాహాద్ ఫాజిల్ కు అల్లు అర్జున్ కు మధ్య సన్నివేశాలపై ఆసక్తి నెలకొంది.
పుష్ప మేనరిజం బాగా వైరల్ అయింది. సినిమాలో పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సినిమాలో దాదాపుగా అందరూ బాగానే నటించారు అని చెప్పాలి. హీరోయిన్ రష్మిక మందన కెరీర్ కి కూడా ఈ సినిమా బెస్ట్ హిట్ గా నిలిచింది అనే చెప్పాలి. పుష్ప రెండో పార్ట్ ని చాలా స్పీడ్ గా షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాలో పాటలకు సంబంధించిన సీన్స్ ని షూట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంచితే పుష్ప రెండో పార్ట్ కి సంబంధించి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి. పుష్ప2 మూవీకి బన్నీ రెమ్యునరేషన్ 100 కోట్ల వరకు ఉంటుందని అదే విధంగా లాభాల్లో భారీగా వాటాలు కూడా తీసుకుంటున్నాడు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఇలాంటి వార్తలు మరింత పెంచుతున్నాయనే చెప్పాలి.