చాలామంది ఇంట్లో కూర్చునే డబ్బును ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తుంటారు. కానీ పని చేయకుండా డబ్బు సంపాదించడం కష్టమైన పని అనే విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ అందరికీ అది పట్టదు. ఎవరి ఆలోచనలు వారివి కదా ! అందుకే కాలు బయట పెట్టకుండా డబ్బు సంపాదించుకునే వారికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. కొన్ని అరుదైన, పాత నాణేలను విక్రయించి మీ ఇంటి వద్ద కూర్చొని ఏకంగా రూ. 5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది.
కొన్నిపురాతన వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంది. అవి ఎంత పురాతనమైనవి అయితే అంత మంచిది. ఆ పురాతన వస్తువులు, పాత వస్తువులు వేలం వేస్తారు. దాదాపు లక్షల్లోనే ఈ వేలంపాట కొనసాగుతుంది. ముఖ్యంగా మీరు పాత నాణేలను కలెక్ట్ చేస్తూ ఉంటే అదృష్టం మీ సొంతం అవ్వొచ్చు. మీ దగ్గర రూ.2 పాత నాణెం ఉంటే ఆన్‌లైన్‌లో రూ.5 లక్షలు సంపాదించవచ్చు. కానీ ఇందులో ట్విస్ట్ ఉంది. ఈ పాత నాణెం 1994, 1995, 1997, 2000 సిరీస్ లోనివై ఉండాలి. మీ సేకరణలో ఈ నాణెం ఉంటే మీరు ఇంట్లో కూర్చునే రూ.5 లక్షలు సంపాదించవచ్చు.
మీరు ఈ అరుదైన నాణేలను కలెక్షన్ చేసినందుకు గర్వపడే సమయం ఇదే. ఒకసారి మీ దగ్గర ఉన్న పాత నాణేల కలెక్షన్ ను చెక్ చేయండి. మీరు వాటిని విక్రయించాలనుకుంటే “క్వికర్” అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి. కానీ పాత నాణెం విక్రయించడానికి మీరు సైట్‌లోని ఆన్‌లైన్ విక్రేతగా నమోదు చేసుకోవాలి. అప్పుడు మీరు నాణెం ఫోటోను క్లిక్ చేసి సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. దీని తరువాత మీరు మీ చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను అందించాలి. వెబ్‌సైట్ మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను ధృవీకరించుకోవాలి. కొనుగోలుదారు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు. అక్కడ నుండి మీరు చెల్లింపు, డెలివరీ నిబంధనల ప్రకారం మీ నాణెం అమ్మవచ్చు. 1982 లో భారతదేశంలో రూ.2 నాణెం ప్రవేశపెట్టారు. ఈ రూ.2 నాణెం కుప్రో-నికెల్ మెటల్‌తో ముద్రించారు. మరి మీ లక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి.