ఉద్యమాలు అంటే పులిపై స్వారీ చేయటం లాంటిది… మద్యలో దిగుతే మింగేస్తాయ్. నష్టమో, కష్టమో… మొదలుపెట్టాం తప్పదు. ఈ వాఖ్యలు చేసింది ఎవరో కాదు… ఉద్యమ సమయంలో స్వయంగా కేసీఆరే ఈ మాటలు అన్నది. అలాంటి ఉద్యమాల నుండి వచ్చిన వారికి… ఓసారి ఉద్యమ నాయకుడు ముద్రపోతే మళ్లీ వస్తుందా…? ఇలా ఎందరో కాలగర్భంలో కలిసిపోయిన వారే. మరీ కొత్తగా మంత్రి పదవి వచ్చిన నాయకుడు ఈ లాజిక్ ఎందుకు మిస్సవుతున్నట్లు…?
మంత్రి శ్రీనివాస్‌గౌడ్. తెలంగాణ ఉద్యమంలో… గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోర్ తరుపున ముందున్నారు. ఉద్యమ ఆకాంక్ష నేరవేరే వరకు పోరాడిన పేరుంది. అందుకే టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే టికెట్, రెండోసారి గెలవగానే మంత్రి అయ్యారు. కానీ అలాంటి మంత్రే… నాడు తాను ముందుండి… ఆర్టీసీ కార్మికులను నడిపించిన నాయకుడే ఇప్పుడు కార్మికులపై హేళనగా మాట్లాడుతున్నారు. సరే… పట్టించుకోకపోతే సరే, ఎరు దాటాక తెప్ప తగలెయ్యటం రాజకీయ నాయకులకు కామనే అయినా… ఉద్యమ నాయకుడిగా కస్తయినా… నా వారే కదా అనుకున్నారు కార్మికులు.
కానీ మంత్రిగారు మాత్రం సీఎంతో సాన్నిహిత్యం కోసం తన గత చరిత్రను మర్చిపోతున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోతే పోనీ… కానీ ఉద్యోగ సంఘాలకు, సీఎంకు మద్య రాయభారాలు ఎందుకు నడపటం…? ఉద్యమ శక్తుల కలయికకు ఎందుకు అడ్డుపడటం…? ఇదీ ఉద్యమ ద్రోహాం కాదా అని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం సీఎం సాన్నిహిత్యం కోసమే ఇదంతా చేస్తున్నారని, గత 5ఏళ్ల కాలంలో ఇదే శ్రీనివాస్‌గౌడ్‌కు, ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కనీసం ముఖం కూడా చూపించలేదన్న విషయం మర్చిపోతే ఎలా…? అని ప్రశ్నిస్తున్నారు.
శ్రీనివాస్‌గౌడ్ ఇప్పుడు సీఎంకు దగ్గరవుతున్నాం అనుకున్నా… కేసీఆర్ వాడకం ఎలా ఉంటుందో తెలంగాణ సమాజానికి తెలుసని, ఉద్యమ సమయంలో… పార్టీలో కీలకంగా ఉన్న ఈటెల, హరీష్‌రావు, నాయినిలాంటి నేతల పరిస్థితి ఏంటని, ఎందుకు ఉద్యమ నాయకునిగా పేరున్న నేత… మంత్రి పదవి కాపాడుకోవటం కోసం ఉద్యమ ద్రోహిగా మారటం అంటూ ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
అయితే, ఆర్టీసీ కార్మికుల ఉద్యమం కాస్త… సకల జన సమ్మెకు దారితీస్తే, మంత్రుల్లో వేటు పడేది ఉద్యోగ సంఘ నేత అయిన శ్రీనివాస్‌గౌడ్ పైనే అని ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.