తెలంగాణ రాష్ట్రం లో కల్వకుంట్ల కుటుంబానికో న్యాయం, తెలంగాణ ప్రజలకో న్యాయం జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ మండిపడింది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితులకు ఇప్పటివరకు పూర్తి స్థాయి నష్ట పరిహారం అందలేదన్నారు . అదేవిధంగా గౌరవెల్లి భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్నారు.
అయితే ఈనెల 20 వ తేదీన కేటీఆర్ పర్యటన నేపథ్యంలో భూనిర్వాసితులు చేస్తున్న దీక్షను పోలీసులు అన్యాయంగా,బలవంతంగా అణిచివేస్తున్నారని ఆ పార్టీ మండిపడింది. ఇక గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు అండగా పోరాటం చేయడానికి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ నాయకులు హుస్నాబాద్ అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే వీరు బైఠాయించిన ప్రదేశానికి పోలీసులు మీడియాను కూడా అనుమతించకపోవడం దారుణమన్నారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం లో విచారణ నిమిత్తం ఢిల్లీకి వెళ్తే ఆమెకు అండగా కేటీఆర్, హరీష్ రావు, BRS నాయకులు వెళ్లారు. కానీ గౌరవెల్లి భూనిర్వాసితులను కలవడానికి వెళ్తే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు నిలదీశారు. గౌరవెల్లి భునిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా కేటీఆర్ పర్యటన చేస్తే కచ్చితంగా అడ్డుకుంటామని ,వారికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జులు డేగల వెంకటేష్, లింగంపల్లి యాదగిరి ,జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్, కోశాధికారి రోమాల బాబు, హుస్నాబాద్ అసెంబ్లీ ఇంచార్జి ఎనగందుల శంకర్, అసెంబ్లీ అధ్యక్షులు రాజు, గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్,మండల నాయకులు పాల్గొన్నారు.