మన తెలుగులో హీరోలను దేవుళ్ళుగా భావిస్తారు అభిమానులు. వారి సినిమా వస్తుంది అంటే చాలు ఇక పాలాభిషేకంతో పాటుగా జంతుబలి లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాంటి హీరో… తమ సినిమాలో చనిపోతే మాత్రం వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు దర్శకులు. అదే తమిళంలో అయితే చూసే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక మన తెలుగులో క్లైమాక్స్ లో హీరో చనిపోయి ఫెయిల్ అయిన సినిమాలు ఏవో చూద్దాం.
Also Read:రాజమౌళి – మహేష్ సినిమాలో విలన్ గా స్టార్ హీరో…?
ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో ప్రభాస్ చనిపోతాడు. దీనితో ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
నాగార్జున హీరోగా వచ్చిన అంతం సినిమాలో కూడా హీరో చనిపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది అని అంటారు పరిశీలకులు.
వేదం సినిమాలో కూడా హీరోలు చనిపోతారు. దీనితో ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు.
ఈ దెబ్బకు చిరంజీవి తన సినిమాల్లో క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఠాగూర్ సినిమా క్లైమాక్స్ ను అందుకే మార్చాలని అడిగారట.
Also Read:మునుగోడు బై ఎలక్షన్: కాళ్లు మొక్కుతూ NSUI వినూత్న ర్యాలీ