వర్షాకాలం వచ్చింది అంటే చాలు మనం ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలా వస్తువులను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక వర్షం పడేలా ఉంటే బయటకు వెళ్తే కచ్చితంగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటివి ప్లగ్ పీకి గాని వెళ్ళే పరిస్థితి ఉండదు. అసలు ఎందుకు అలా చేయాలి…? పిడుగులు పడినా భారీ ఉరుములు వచ్చినా ఎందుకు అంత నష్టం జరుగుతుంది…? దాని వెనుక ఉన్న కారణం ఏంటో చూద్దాం.
Also Read:జనసేనకు నడ్డా క్లారిటీ ఇచ్చినట్టేనా?
పిడుగులతో కూడిన వర్షం పడినప్పుడు పడినప్పుడు, కరెంటు పోయినా ఇంట్లో టీవీ, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిని కచ్చితంగా ఆపుకోవడమే మంచిది. మన ఇళ్లలో వాడే కరెంట్ దాదాపూ 250 ఓల్ట్స్, 15 – 20 ఆంపియర్స్ ఉంటుంది. ఒక సాధారణ పిడుగు 300 మిలియన్ ఓల్ట్స్ , 30,000 ఆంపియర్ వరకు ఉంటుంది. తేమ వాతావరణం తప్ప మరే ఇతర కండక్టర్ లేకుండానే అన్ని అడుగుల ఎత్తు నుంచి భూమికి పిడుగు వస్తుంది.
స్విచ్ ఆన్ ఆఫ్ మధ్య మహా అయితే ఒక ఇంచ్ గ్యాప్ ఉంటుంది. నిజంగానే దగ్గరలో పిడుగు పడితే, స్విచ్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా నష్టం తగ్గదు. కచ్చితంగా ప్లగ్ తీసి పక్కన పెట్టాల్సిందే. విలువైన పరికరాలు ఉంటే కచ్చితంగా జాగ్రత్త పడాలి. ఒక కాపర్ రాడ్ ని తీసుకుని ఇంటి పై భాగంలో ఎత్తైన ప్రదేశంలో నిలబెట్టి దాన్నుంచీ ఇంకో కాపర్ రాడ్ కి కనెక్షన్ ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి భూమిలో గ్రుంత త్రవ్వి పాతి పెడితే పిడుగు ఇంటి మీద పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.