ఈ రోజుల్లో ఫోన్ అనేది అత్యవసరంగా మారిపోయిన మాట వాస్తవం. ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. నిద్రపోయే సమయంలో కూడా ఫోన్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే నిద్రపోయే సమయంలో ఫోన్ ఉండటం మగవాళ్ళకు ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. ఇది అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రధానంగా శృంగారం విషయంలో సమస్యలు ఎదుర్కొంటారట. మొబైల్ ఫోన్ రేడియేషన్ తో అంగస్తంభన లోపం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని… ఫోన్ నుంచి వచ్చే బ్లూ కిరణాలతో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి నిలిచిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అక్కడి నుంచి నిద్రలేకపోవడం, మెదడు క్యాన్సర్ వంటివి రావడం జరుగుతాయట.
మెదడు క్యాన్సర్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చింది. పడుకునే ముందు… ఫోన్ ను కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచాలి. ఇక పడుకునే ముందు… ఫోన్ ని అరగంట ముందే దూరంగా ఉంచాలి. నిద్రపోయే ముందు నోటిఫికేషన్స్, వైబ్రేషన్స్ రాకుండా చూడాలి. ఫోన్ పక్కన ఉంటే… మార్నింగ్ లేచినప్పుడు బద్దకంగా ఉండటం, చికాకుగా ఉండటం, ఏవేవో ఆలోచనలు, మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం, గుండె సమస్యలు, బరువు పెరగడం వంటివి వచ్చే అవకాశం ఉందట. తల నొప్పి, కండరాల నొప్పికి కూడా ఇదే కారణం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు