రైలు గురించి గాని రైలు ప్రయాణం గురించి గాని తెలుసుకోవాలి అనుకుంటే ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి విషయమే ఒకటి రైలు ప్రయాణం సమయంలో వంతెనపై ఎందుకు ఎక్కువ శబ్దం వస్తుంది అనేది. రైలు వంతెన పై వెళ్తున్న సమయంలో డైనమిక్ లోడింగ్ తో వంతెన ఎక్కువగా ప్రకంపిస్తుంది. వంతెన ఫ్రేమ్ ను క్రింద స్తంభాలకు బిగించినప్పటికి, ఆ ఇనుప ఫ్రేమ్ లో అధిక భాగానికి డ్యాంపింగ్ అసలు ఉండదు. డ్యాంపింగ్ అంటే ప్రకంపనలను పూర్తిగా కంట్రోల్ చేయడం అని అర్ధం.
Also Read: కాలికి మెట్టెలకు గర్భానికి సంబంధం ఏంటీ…?
అందుకే మనకి రైలు వంతెన పై వెళ్తున్నప్పుడు ఎక్కువ శబ్దం వినపడుతుంది. ఆ శబ్దానికి కారణం వంతెన (ఫ్రేమ్) నుంచి వచ్చే వైబ్రేషన్. భూమి మీద అయితే మనకు అంత శబ్దం వినపడదు. భూమి మీద రైలు వెళ్ళే సమయంలో పట్టాలు ప్రకంపనలను వాటి క్రింద అమర్చిన సిమెంట్ దూలాలు కంకర రాళ్ళ గుట్ట తీసుకుంటాయి. దానితో పూర్తి డ్యాంపింగ్ జరిగి మనకు ఎక్కువ శబ్దం వినపడే అవకాశం ఉండదు. పట్టాల మధ్యలో ఏర్పడిన చిన్న ఖాళీల పై నుండి రైలు చక్రం వెళ్ళినప్పుడు మాత్రమే డక్-డక్ మని ఒక శబ్దం వినపడుతుంది.
ఖాళీలు లేకపోతే మాత్రం రెండు ఇనుప ముక్కలను ఒకదానిపై ఒకటి గీస్తే వచ్చిన శబ్దంలా వినపడుతుంది. ఇక మరొకటి… క్రాసింగ్ వద్ద పట్టాలు మారుతున్నప్పుడు వినపడే శబ్దం. బోగీలకు ఉండే బఫర్లు ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు ఈ శబ్దం వినపడుతుంది. వంతెన మీద వెళ్ళే సమయంలో ఈ శబ్దాలతో పాటు, డైనమిక్ లోడింగ్ వలన వచ్చే ప్రకంపనల శబ్దం అధికంగా ఉండడంతో మనకి ఎక్కువ శబ్దం వినపడుతుంది.
Also Read: మేజర్ కు సెల్యూట్ కొట్టాల్సిందే