భార్య గర్భవతిగా ఉంటే చాలా మంది భర్తలు గడ్డంతో ఎక్కువగా ఉంటారు. ఎందుకు అలా అనేది చాలా మందికి క్లారిటీ లేదు. పిల్లని కనడాన్ని వైదిక సంప్రదాయంలో ఒక యజ్ఞంలా భావించేవారు. కాబట్టి సనాతన ధర్మంలో సృష్టిని యజ్ఞం అని పిలిచారు. ఆ తర్వాత గర్భధారణ జరిగిన అనంతరం, 3 వ నెల నుంచి భార్య గర్భం దాల్చాక భర్త కేశపాశాలను పెంచుకుంటూ ఉంటాడు. ముందుకాలంలో గర్భం దాల్చి బిడ్డ బయటికొచ్చే కాలాన్ని జాతా సౌచం అని పిలిచే వారు.
Also Read:ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ ఎందుకు కడతారు…?
క్షౌరం చేసేప్పుడు ఏదేని దెబ్బ తగిలి అది పుండు అవుతుందని, దానితో ఇన్ఫెక్షన్స్ వస్తాయని, అది భార్యకు మంచిది కాదని భావించే వారు. స్మశానానికి వెళ్తే అక్కడున్న మన కంటికి కనపడని వైరస్ లు ఇంకా పోస్ఫోరస్ లాంటివి ఇంట్లోకి వస్తాయని దీనితో కడుపులో బిడ్డకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించి సదరు భర్తను స్మశానానికి అనుమతించేవారు కాదు అప్పట్లో. అంతే కాదు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునే వారు.
ఆ అబ్బాయిని పథ్యమైన ఆహరం అంటే ఉప్పు కారం వంటివి తగ్గించి ఇచ్చే వారు. అలా చేయడంతో భార్య మానసిక స్థితిని మనస్థితిని కొంచెం ఓపికగా భరిస్తాడని, అన్ని ఇబ్బందులకు ఓర్చుకుని కాపాడుకుంటాడు అని నమ్మేవారు. అలాగే అన్యులకు అయన మీద కామ కోరికలు ఏర్పడకుండా అతను ఒక దీక్షలో ఉన్నాడని సూచించడం. గడ్డం మీసం క్షౌరం లేకుండా ఉండమని చెప్పే వారు. అలాగే దేవాలయాలకు కూడా వెళ్లే వారు కాదు. కొబ్బరికాయలు కొట్టడం కూడా నిషేధించారు. భర్త ఇంటి దగ్గరే ఉండే విధంగా కఠిన నియమాలు విధించే వారు అప్పట్లో. ఇప్పుడు పితృత్వ సెలవలు అంటున్నారుగా… అవే మరి.
Also Read:నా భార్య ఒక్క పైసా తీసుకోలేదు… మనీశ్ సిసోడియాపై అసోం సీఎం ఫైర్