గత కొంతకాలం నుంచి కరోనా కారణంగా కాలు ఇంట్లో నుంచి బయట పెట్టాలంటే భయమేస్తోంది. ఎక్కడ కరోనా సోకుతుందో లేదంటే దాని వేరియంట్లు వెంటాడతాయో అన్న భయంతో బయటకు వెళ్లినా తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు ప్రజలు. అలాగైనా మంచే జరుగుతోంది. అయితే ఈ సమయంలో కొంతమంది కాలు బయట పెట్టకుండా తమ స్మార్ట్ నెస్ తో ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదిస్తున్నారు. అదికూడా పాత నోట్లు, నాణేలతో.
ప్రస్తుతం పాత నాణేలు, నోట్లను ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా చాలా డబ్బునే జేబుల్లో వేసుకుంటున్నారు కొంతమంది స్మార్ట్ పర్సన్స్. నాణేలు, నోట్లు ఎంత పాతవైతే వాటికి అంత విలువ. అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న పురాతన కేటగిరీలో ఈ నాణేలు, నోట్లు పడిపోవడంతో అధిక విలువకు అమ్ముడవుతున్నాయి. ఈ అరుదైన పాత నాణేలలో కొన్ని మీ దగ్గర ఉంటే చాలు మీరు ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలు సంపాదించొచ్చు.
Advertisements
ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. పాత నాణేలు, నోట్లను సేకరించే అభిరుచిని కలిగి ఉంటే అదే మిమ్మల్ని మిలియనీర్లుగా మార్చుతుందన్న మాట. గత కొన్ని ఏళ్లుగా మన దేశంలో అనేక నాణేలు, నోట్ల తయారీ నిలిచిపోయింది. దీని కారణంగా ఆ నాణేల విలువ చాలా పెరిగింది. మీ దగ్గర 786 సీరియల్‌తో కూడిన రూ.10 నోటు ఉంటే దానిని ఇ-బే వెబ్‌సైట్‌లో అమ్మేసి రూ. 5 లక్షల వరకు సంపాదించవచ్చు. క్లిక్ ఇండియా వెబ్‌సైట్‌లోనూ పాత నోట్లను అమ్మొచ్చు. ముందుగా మీరు ఆయా వెబ్సైట్లలో నమోదు చేసుకోవాలి. తరువాత నోట్ ఫోటోను క్లిక్ చేసి వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేయండి. మీరు అదృష్టవంతులైతే కొనుగోలుదారులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు.