మలయాళ హీరోయిన్ లు కొందరు టాలీవుడ్ లో ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటారు. సమంతా, కీర్తి సురేశ్ హవా ఎక్కువగా ఈ మధ్య కాలంలో కనపడుతుంది. అలాగే అనుపమా పరమేశ్వరన్ విషయంలో కూడా ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనుపమ విషయంలో అభిమానులు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు. ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమా ద్వారా వల్లీ అనే కన్నింగ్ పాత్రతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె… వరుస ఆఫర్లతో తర్వాత దూసుకుపోయింది. రామ్, సాయి తేజ్ వంటి హీరోల సినిమాలో మంచి అవకాశాలు తెచ్చుకుంది. అయితే 2019 లో బెల్లకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. టాలెంట్ ఉన్నా సరే ఆమెను పెద్దగా టాలీవుడ్ కౌంట్ చేయడం లేదు.
అయితే ఆమె అవగాహన లేక కొన్ని మంచి సినిమాలు వదులుకుంది. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూస్తే…
నేను లోకల్, మహానుభావుడు, రంగస్థలం, చల్ మోహన్ రంగా, అరవింద సమేతలో ఇషా రెబ్బ చేసిన పాత్ర, ఎన్టీఆర్ కథానాయకుడు, ఇస్మార్ట్ శంకర్ లో నభా నతేష్ పాత్ర, అర్జున్ సురవరం, వీ లో అదితి రావు హైదరీ చేసిన పాత్ర, నిశబ్దంలో శాలిని పాండే చేసిన పాత్ర చేసి ఉంటే ఆమె కెరీర్ కాస్త ఊపు అందుకునేది. కాని అవగాహన లేక ఆ సినిమాలు వదులుకుంది.