ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతుంది మరోవైపు ఆత్మ స్థైర్యం కోల్పోతున్న కార్మికులు గుండే పగిలి కొందరు, ఆత్మహత్య చేసుకుంటూ మరి కొందరు ప్రాణాలు వదులుతున్నారు. అయినా ప్రభుత్వ పెద్దలలో చలనం కనబడటం లేదు అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు. ఎందుకు ఇంత మొండి పట్టుదలతో ఉన్నారో అర్థంకావడం లేదు అంటున్నారు. కనీసం ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం కూడా చేయకపోవడం దుర్మార్గం అంటున్నారు. మానవత్వంతో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను అందుకోవాలని కోరుతున్నారు కార్మికులు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వందలమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఎక్కడా ఏ ఉద్యమంలో కూడా లేనివిధంగా తెలంగాణ ఉద్యమంలో ఆత్మ హత్యలు చేసుకున్నారు. అది ఒక పోరాట రూపంగా నాడు కేసీఅర్, టీఆర్ఎస్ కొనియాడారు. బలిదానాలు చేసుకున్నవారిని అమరవీరులుగా గుర్తించారు… వారి అంతిమయాత్రలకు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆత్మ బలిదానాలు పాల్పడుతున్నారు కార్మికులు. ఉద్యమ సందర్భంలో సీమాంధ్ర నాయకుల ప్రకటనలతో మనోధైర్యం కోల్పోయి యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేసీఅర్, టీఆర్ఎస్ పదే పదే ప్రకటనలు చేసింది. కొంతమంది సీమాంధ్ర నాయకులతో పాటు తెలంగాణ నాయకులు సైతం కేసీఅర్ రెచ్చగొట్టే ప్రకటనలతో నే యువకులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు అని ఎదురు దాడి చేసిన విషయాని కూడా గుర్తు చేస్తున్నారు.
నేడు ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలను పరిశీలిస్తే కార్మికుల గుండెలు ఎందుకు ఆగుతున్నాయి. ఎందుకు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారో అర్థం అవుతుంది. కేసీఅర్ చెప్తున్నట్లు కార్మికుల చావులకు యూనియన్ నాయకులే కారణం అయితే, నాడు జరిగిన యువకుల ఆత్మ బలిదానాలకు తానే కారణం అని కేసీఅర్ ఒప్పుకుంటారా అని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం నడిపేవారే కారణం అని కేసీఅర్ అంటే మొదలు అది ఆయనకే వర్తిస్తుంది అంటున్నారు. లేదా కేసీఅర్ నాడు చెప్పినట్లుగా… సీమాంధ్ర నాయకుల ప్రకటనలతో తెలంగాణ వస్తుందో రాదో అనే భయంతో మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే వాదన ప్రకారం చూసినా నేడు కార్మికులు మనోధైర్యం కోల్పోవడానికి కేసీఅర్ ప్రకటనలే కారణం అని చెప్పకతప్పదు అంటున్నారు. మా సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో మా ఉద్యోగాలు ఉంటాయో లేదో అసలు ఆర్టీసీ ఉంటుందో లేదో ఇలా అనేక ప్రశ్నలకు వారిదగ్గర సమాధానం లేదు. దాంతో వారు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. మరో దారిలేక గుండే పగిలి మరణిస్తున్నారు. కొందరు ఆత్మ బలిదానాలు చేసుకొని ఉద్యమానికి ఊపిరి పోయాలని భావిస్తున్నారు.
ఇప్పటికైనా కేసీఅర్ తన మొండి పట్టుదల వదిలి కార్మికులతో చర్చలు జరపాలని కోరుకుంటున్నారు. వితండ వాదాలు మానుకోవాలని, ఉద్యమాలతో తెలంగాణ సాధించామని మరిచిపోకూడదు అంటున్నారు. సంఘాలు యునియన్స్ అన్నవి మీ అవసరానికి పుట్టి మీ అవసరం తీరగానే పోవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి హితవు చెపుతున్నారు. నాటి స్వతంత్ర పోరాటం నుండి మొన్నటి తెలంగాణ పోరాటం వరకు ఏ పోరాట చరిత్ర చూసిన యునియన్స్ కీలకపాత్ర పోషించాయని గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు చేసే ఉద్యమాలతోనే కార్మికులు పనిగంటలు తగ్గించుకున్నదని… నాడు చికాగోలో చేసిన పోరాటమే నేటికీ మేడే పేరుతో ప్రపంచమంతా పోరాట దినం జరుపుకుంటారని గుర్తు చేస్తున్నారు. చరిత్ర చదివి, చరిత్ర తెలిసిన వ్యక్తిగా ఇలా చేయడం అవివేకమన్న కావాలి లేక అహంకారం అయినా కావాలని మండిపడుతున్నారు.