ప్రస్తుతం పెళ్లికి ఎలాంటి తొందర లేదంటుంది అందాల రాశి రాశీఖన్నా. సినిమాల్లో బిజీగా ఉన్నా.. ఒక వేళ పెళ్ళి కుదిరితే ఆ విషయాన్ని నేనే స్వయంగా చెబుతానంటోంది. కెరీర్ లో పెద్దగా బాధపడిన సందర్భాలేమీ లేవన్న ఈ బ్యూటీ.. తన ప్రయాణంలో మాత్రం ఎంతో నేర్చుకున్నానని చెబుతోంది.
ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉన్న ఫర్జీ వెబ్ సిరీస్ గురించి పాత్రికేయులతో ముచ్చటించిన రాశీ ఖన్నా.. తన గురించి..తన కెరీర్ గురించి చాలా విషయాలు చెబుకుంటూ వచ్చింది. ఈ సిరీస్ లో బలమైక వ్యక్తిత్వం కల్గిన మేఘా పాత్రను పోషించానంది. ఇది తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని ఆనందం వ్యక్తం చేసింది. రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో షాహిద్ కపూర, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్ని పోషించారు.
రుద్ర తర్వాత హిందీలో ఆమెది ఇది రెండో సిరీస్. కథ చెప్పిన తరువాత నకిలీ కరెన్సీ గురించి కొంత సమాచారం సేకరించిందట రాశీ ఖన్నా.అప్పుడు ప్రతి ఐదు నోట్లలో ఒకటి ఫేక్ కరెన్సీ ఉంటుందని తెలిసిందట. సినిమాలతో పోల్చితే వెబ్ సిరీస్ లలో భావోద్వేగాల్ని మరింత బలంగా ఆవిష్కరించే వీలుంటుందని చెబుతోంది. అయితే పెద్ద తెర మీద సినిమా చూడటాన్ని మించిన అనుభవం ఏదీ ఉండదంటోంది ఈ చిన్నది.
ఇక ఈ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ తో నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని.. సినిమాలు,వెబ్ సిరీస్ లలో సమాంతరంగా నటించడం అంత కష్టంగా అనిపించడం లేదని చెప్పింది. ఎక్కడైనా షూటింగ్ వాతావరణం ఒకే రకంగా ఉందట. తెలుగు నాలుగు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నయాని.. ఇప్పట్లో పెళ్ళికి ఏమాత్రం తొందర లేదని చెప్పింది. ప్రస్తుతం సీరియస్ గా సాగే ఛాలెంజింగ్ రోల్స్ మీద దృష్టి పెడుతున్నా అని చెప్పింది.