ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో మార్పు కోసం ప్రజలంతా నమ్మి ఓట్లేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వారి నమ్మకాన్ని వొమ్ము చేశారన్నారు. మోసపూరిత హామీలతో గద్దెక్కిన కేజ్రీవాల్.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు ఛార్జ్ షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రస్తావన రావడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన కేజ్రీవాల్, కవిత పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతిని అంతమొందిస్తానన్న మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కేజ్రీవాల్.. నమ్మిన వారందరికి వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు.
అవినీతికి వ్యతిరేకంగా సమాజ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. ఈ దేశంలో ఉన్న యువతీయువకులు ఓ మార్పును కోరుకుని కేజ్రీవాల్ కు ఓట్లేసి గెలిపించారన్నారు భట్టి. కానీ ఆయన అవినీతిలో మునిగితేలుతున్నారని విమర్శించారు. ఇంతకంటే ప్రమాదకరమైనది ఏదీ ఉండదన్నారు. ప్రజల నమ్మకాన్ని ఆయన వొమ్ము చేశారన్నారు.
యువతకు ఉన్న భరోసాను ఆయన దూరం చేశారన్నారని మండిపడ్డారు భట్టి విక్రమార్క. అలాంటి నాయకుడు సమాజానికి ప్రమాదకరమన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగమైప వారందరిపై చర్యలు తీసుకోవాలని ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.