అక్రమ నగదు లావాదేవీలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 20 లక్షల రూపాయలకు మించి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరిగా సమర్పించాలి. 2022, మే 10 నాటి నోటిఫికేషన్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ రూపొందించిన కొత్త నియమాలు, నిబంధనలను సవరించింది. ఈమేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఒక్కరోజులో రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను సేకరించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి.
పాన్ కార్డు లేని వ్యక్తులు రోజుకు రోజుకు 50 వేలు లేదా ఏడాదికి 20 లక్షల లావాదేవీలు జరపాలంటే… డిపాజిట్ చేసేందుకు వారం ముందుగానే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆర్థిక నేరాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్నుశాఖ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు గత కొన్నేళ్లుగా కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. అలాగే ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నాయి. అందులో భాగంగానే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బును తీసుకోరాదు. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బును తీస్కోవడాన్ని ప్రభుత్వం కూడా నిషేధించింది.
సన్నిహిత కుటుంబ సభ్యులనుంచి తప్ప రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదును స్వీకరించడం కూడా నిషేధం. నిబంధనలకు విరుద్థంగా పరిమితికి మించి నగదు చెల్లించినా, స్వీకరించినా లావాదేవీ మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.