యువతను ఊర్రూతలూగించిన రకుల్ ఇప్పుడు తనలోని మెచ్యూరిటీని ప్రదర్శించడానికి సిద్దమైంది. అయితే డబ్బు కోసం మాత్రం సినిమాలు చేయొద్దని సలహా ఇస్తున్న ఈ బ్యూటీ.. తన కొత్త సినిమా ఛత్రివాలీ ద్వారా తాను ప్రయోగాలకు సిద్దంగా ఉన్నానని తెలియజేస్తోంది. మరో వైపు రకుల్ తన మనసులోని మాటాలను ఏమాత్రం వెనుకాడ కుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
కరోనా ఓ మంచి పని చేసింది. లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ కూ, ప్రాంతీయ సినిమాలకూ మధ్య ఉన్న విభజన చెరిగిపోయింది. దీంతో దక్షిణాది చిత్రాల గురించి దేశానికంతా తెలిసింది. వీక్షకులకు కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. నిజమే, సినిమాల్లో మగవాళ్లదే అధిపత్యం. మనం నివసిస్తున్నదీ పురుషాధిక్య సమాజంలోనే. అంత మాత్రానా భయపడుతూ కూర్చోలేం. ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్లిపోలేం.
నేను పురుషుడినా, స్త్రీనా అన్నది అప్రస్తుతం. నేనో స్టార్ ని. నటన నా ప్రాణం. ఆ దృక్పథంతోనే నేను పరిశ్రమను చూస్తాను. అమ్మానాన్న కూడా ఎలాంటి వివక్ష లేకుండా పెంచారు నన్ను.జీవితం పర్వతారోహణ లాంటిది. పైకి వెళ్లేకొద్దీ సవాళ్లే. అక్కడితో ఆగిపోతే.. చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే. లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే. శిఖరాన్ని ముద్దాడాల్సిందే. పరిశ్రమ మీద మనదైన ముద్ర వేయాలంటే.. కష్టపడాలి,విమర్శల్ని తట్టుకోవాలి. అమితాబ్ సర్ సహా.. ప్రతి నటుడూ ఓ పాఠమే నాకు.
షూటింగ్ లేకపోతే నేను స్నేహితులతో కాలక్షేపం చేస్తాను. కుటుంబంతో గడుపుతాను. ఇంకా గోల్ఫ్ ఆడతాను. ఇష్టమైన సినిమాలు చూస్తాను. కానీ ఎక్కువ రోజులు ఖాళీగా కూర్చోలేను. నేను వర్క్ హాలిక్. నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు, ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. పెళ్లే కాదు,దేని గురించి ఆలోచించేంత సమయం లేదు.
గ్లామర్ కోసమో, డబ్బు కోసమో పరిశ్రమలోకి రావద్దనే చెబుతాను. రోజుకు రెండు మూడు గంటలు కూడా నిద్రపోని సందర్బాలున్నాయి. కడుపునిండా తినలేం. హాయిగా వీధుల్లో తిరగలేం. ఇష్టమైన రెస్టారెంట్స్ కు వెళ్లలేం. మన జీవితం సినిమా షెడ్యూల్ చుట్టూ తిరుగుతుంది. ఆరు నూరైనా ఆ సమయానికి అందుబాటులో ఉండాల్సిందే. బలమైన సంకల్పం లేకపోతే పరిశ్రమలో బతకలేమని రకుల్ బోల్డ్ గా చెప్పుకొచ్చింది.