హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రెడ్యానాయక్. డోర్నకల్ లో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడాడు అంటూ మండి పడ్డారు. నేను, నా కూతురు ఎటువంటి భూముల కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కు 20ఏళ్లు భవిష్యత్ లేదు.. కాబట్టే బీఆర్ఎస్ లో చేరామని తెలిపారు. హైదరాబాద్ లో మాకు సెంటు భూమి లేదని, గతంలో కొంత భూమి కొని.. తర్వాత అమ్మేసామన్నారు. గతంలో ఇదే భూమిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి నిరూపించకుంటే 10 చెప్పు దెబ్బలు తింటాడా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
డోర్నరల్ ప్రజలకు నా నీతి నిజాయితీ తెలుసన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మేలర్ అన్నారు. పీసీసీ పదవిలో డబ్బుతో కొనుక్కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను రేవంత్ భ్రష్టు పట్టించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పీసీసీ అయిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారని తెలిపారు. రంగులేసినోడు వేల కోట్లకు శ్రీమంతుడు ఎలా అయ్యాడు అంటూ అడిగారు.
ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి.. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు ఎస్టీ, ఎస్పీ జాబితాల్లో చేర్చాయన్నారు. ఉమ్మడి ఏపీలో ఎస్టీలో చేర్చాలని ఉద్యమాలు జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత చెల్లప్ప కమీషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ను ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.