తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు రామిరెడ్డి .. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో ఎంతోమంది విలన్స్ ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. అయితే ఈ విలన్స్ లో కూడా గుర్తింపు సంపాదించుకున్న విలన్స్ సంఖ్య చాలా తక్కువ.. కానీ అలా ప్రేక్షకుల మన్ననలు పొంది వారిచేత చివాట్లు పడ్డ ప్రముఖ విలన్ రామిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Also Read: ఆయనతో సినిమా … నో ఛాన్స్!!
ఈయన సినిమాలలో ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు అంటే నిజజీవితంలో కూడా ఇతడిని చూసిన మహిళలు చీత్కరించుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే విలన్ గా తన నటనా ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 250 కి పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రామిరెడ్డి అంకుశం సినిమాతో విలన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఆ తర్వాత మెయిన్ విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి అలరించారు. స్పాట్ పెడ్తా అనే డైలాగ్ ఎంతో పాపులారిటీ తెచ్చి పెట్టింది. అప్పట్లో ఏ నోట విన్న ఈ డైలాగ్ వినిపించేది.
కొన్ని సినిమాలలో వెరైటీ రోల్స్ లో కూడా కనిపించారు రామిరెడ్డి. సినిమా జీవితంలో ఎంతో ఉన్నతంగా బతికిన ఈయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో కొంతకాలం బాధపడి 2011 ఏప్రిల్ 14వ తేదీన మృతి చెందారు. 55 సంవత్సరాల వయసులో రామిరెడ్డి మృతిచెందగా కిడ్నీ సమస్యల వల్ల ఆయన ఎంతో టార్చర్ అనుభవించారని కూడా సమాచారం. ఆ సమయంలో బరువు కూడా తగ్గడంతో ఆయనను చాలామంది గుర్తుపట్టలేకపోయారు.
రామిరెడ్డి మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని చెప్పాలి. రామిరెడ్డి తరచూ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. అయితే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన సినిమాల ద్వారా ఆయన మాత్రం ఎప్పటికీ అభిమానుల గుండెల్లో బ్రతికే ఉన్నారని చెప్పవచ్చు.
రామిరెడ్డి ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా జర్నలిస్టుగా కూడా పనిచేశారు. అంతేకాదు కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారని సమాచారం.
Also Read: దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పిన బాలయ్య