తెలుగులో ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్ లు చెరగని ముద్ర వేసిన మాట వాస్తవం. అగ్ర హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు ఇలా ఏ సినిమా వదలకుండా చేస్తూ దూసుకుపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో కాజల్ ఒకరు. కాజల్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హాట్ టాపిక్ అయింది. అందరు హీరోలతో సినిమాలు చేసిన ఆమె పెళ్లి కూడా ప్రముఖుడినే చేసుకుంది.
లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంచితే ఆమె ఆస్తులు బాగానే కూడబెట్టింది అనే టాక్ ఉంది. చందమామ, మగధీర వంటి వరుస హిట్ సినిమాల ద్వారా వచ్చిన స్టార్ ఇమేజ్ ని బాగానే వాడుకుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
ఈమె ఇండస్ట్రీలో ఉంటూ సుమారు100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించింది అంటున్నారు. సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా ఆమెకు భారీగానే సొమ్ము వచ్చి పడింది. ఈమె వార్షిక ఆదాయం కూడా సుమారు ఆరు కోట్లకు పైగా ఉంటుందని అలాగే ఖరీదైన కార్లు కూడా కొనుగోలు చేసింది అంటున్నారు. ఆమె ఖరీదైన ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.