కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుల్లో రాజమౌళి ఒకరు. స్టార్ హీరోలు అందరూ దాదాపుగా ఆయనతో సినిమాలు చేసేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. బాహుబలి సినిమాతో ఆయన క్రేజ్ హాలీవుడ్ కి వెళ్ళింది అనే మాట వాస్తవం. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో భారీ సినిమా చేసారు.
Also Read:ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు….!
ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇక మహేష్ బాబుతో చేసే సినిమా కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి రెమ్యునరేషన్ విషయానికి వస్తే… హీరోల కంటే ఎక్కువగా తీసుకుంటారు అని అంటూ ఉంటారు. అలాగే లాభాల్లో కూడా ఆయన వాటాలు తీసుకుంటారు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుందో చూద్దాం.
రాజమౌళి సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తుల విలువ 158 కోట్ల వరకూ ఉంటుంది అని టాక్ నడుస్తుంది. బాహుబలి సినిమాకు 50 కోట్లకు పైగానే తీసుకున్నారని సమాచారం. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాకు 80 కోట్ల వరకు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక మహేష్ బాబు సినిమాకు వంద కోట్లకు పైగా తీసుకునే అవకాశం ఉందనే వార్తలు టాలీవుడ్ లో వినపడుతున్నాయి.
Also Read:బీజేపీ లక్ష్యమదే… సీఏఏపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు….!