ఎప్పుడో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోయిన్ గా మారిపోయిన స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పుడు కూడా బిజీగానే గడుపుతుంది. మొన్నా మధ్య అవకాశాలు లేక కాస్త ఇబ్బంది పడిన ఈ అమ్మడు ఇప్పుడు అవకాశాలతో బిజీగానే ఉంది. అటు బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇక ఐటెం సాంగ్స్ లో కూడా ఆమె కనపడుతూ బాగానే సంపాదిస్తుంది.
ఉన్నత విద్యను అభ్యసించినా సినిమాల మీద ఇష్టంతో ఆ రంగంలోకి అడుగు పెట్టి దూసుకుపోయింది. ఇలా తమన్నా సంపాదన బాగానే పెరిగింది. అసలు ఆమె ఆస్తి ఎంత ఉంటుంది ఏంటీ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. అసలు తమన్నా ఆస్తులు ఎంతో ఒకసారి చూద్దాం. తమన్నా వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ 12 కోట్లు అని టాక్. అంటే నెలకు కోటి వరకు ఆమె ఆదాయం ఉంటుంది.
ఆమె ఆస్తి మొత్తం విలువ చూస్తే దాదాపుగా 110 కోట్లకు పైనే ఉందని టాక్. ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల వరకు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఐటెం సాంగ్ కి కోటి కూడా అడిగింది అని టాక్. ఇలా తమన్నా బాగానే సంపాదించింది. ఇక తండ్రి నుంచి వారసత్వ ఆస్తులు కూడా ఆమెకు బాగానే వచ్చాయి. కాగా తమన్నా ఇప్పుడు తమిళ సినిమాల్లో ఎక్కువగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.