సినిమా ప్రముఖుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ఇతర కార్యక్రమాలు జరిగినా సరే మీడియా హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళు అయితే మరింత హైప్ ఉంటుంది. ఏదీ లేకపోయినా ఏదోక విషయాన్ని ఆ పెళ్ళిలో జరిగే అంశాలతో లింక్ చేసి హడావుడి చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఇప్పుడు అలీ కుమార్తె పెళ్లి జరిగింది. దీనికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి.
అలీ తన కుమార్తె పెళ్ళికి ఎంత ఖర్చు చేసాడు, అల్లుడు ఎవరు వంటి అనేక విషయాలకు సంబంధించి మీడియా ఫోకస్ చేసింది. అసలు అతని అల్లుడికి ఉన్న ఆస్తులు ఏంటీ, అతను ఏం చదివాడు, అలీ కట్నంగా ఏం ఇచ్చాడు వంటి విషయాలను కాస్త ఎక్కువగా ఫోకస్ చేసారు. అసలు అతను ఏం చేస్తాడు, అతని గురించి విషయాలు ఏంటో చూద్దాం. డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసిన అలీ కూతురు డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
అల్లుడు షెహ్యాజ్ కూడా డాక్టర్ కావడంతో అలీ వెనకడుగు వేయలేదు. అతని తల్లి తండ్రుల విషయానికి వస్తే… జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు అయిన షెహ్యాజ్ కు అన్నయ్యతో పాటుగా సోదరి కూడా ఉన్నారు. అతని ఫ్యామిలీలో డాక్టర్ లు ఎక్కువగా ఉన్నారు. షెహ్యాజ్ గుంటూరుకి చెందిన వ్యక్తి అయినా సరే వాళ్ళు వృత్తిపరంగా లండన్ లోనే నివాసం ఉంటున్నారు. కూతురు కూడా డాక్టర్ కావడంతో అలీ ఇక వెనకడుగు వేయలేదు.